హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇడుపులపాయలో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరికలు

KDP: ఇడుపులపాయలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మారుతినగర్‌లో టీడీపీకి చెందిన పలువురు కుటుంబాలు వైసీపీలో చేరారు. గండి ఆలయ మాజీ ఛైర్మన్ కావలి కృష్ణతేజ ఆధ్వర్యంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇడుపులపాయ వైసీపీ నేతలు పోతిరెడ్డి శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.