SKLM: పలాస కిడ్నీ ఆసుపత్రిని ఇవాళ ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు విధుల్లో ఉండాల్సిన డాక్టర్స్, వైద్య సిబ్బంది రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఇద్దరు మాత్రమే సమయానికి విధి నిర్వహణలో ఉన్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పేదలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఆసుపత్రిని తనిఖీ చేసిన MLA


