హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్మశానవాటికకు దారేదీ.. బురద రోడ్డులో మృతదేహంతో అవస్థలు

MLG: ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో శ్మశానవాటికకు వెళ్లేందుకు రహదారి లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం గ్రామంలో ఓ వ్యక్తి మృతిచెందడంతో బురద రోడ్డులో పాడె మోస్తూ నడవాల్సి వచ్చింది. రహదారి అధ్వానంగా ఉండటంతో మృతదేహం పాడెపై నుంచి జారిపడే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.