W.G: సఖినేటిపల్లి-నరసాపురం రేవులో పంటు రాకపోకలను శనివారం ఉదయం నుంచి అధికారులు పునరుద్ధరించారు. భారీ వర్షాలు, వరద హెచ్చరికల వల్ల శుక్రవారం ఈ రేవులో పంటు సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గి వాతావరణం అనుకూలించడంతో సర్వీసులను తిరిగి మొదలుపెట్టారు. దీంతో ప్రయాణికులు సాధారణ రాకపోకలు సాగిస్తూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురం రేవులో పంటు రాకపోకలు పునఃప్రారంభం


