KRNL: ఎమ్మిగనూరు గాంధీనగర్‌లో పాఠశాలలకు వెళ్లే రహదారిలో కల్వర్టుపై భారీ గుంత ఏర్పడింది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద వాహనాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కల్వర్టుపై భారీ గుంత.. ప్రమాదాల భయం


