SRPT: సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు వద్ద వినాయక నిమజ్జనం అనంతరం పూజా సామగ్రి, చెత్తను అక్కడే వదిలివేయడంతో, పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు వద్ద చెత్త పేరుకుపోవడంతో పారిశుద్ధ్య సమస్య తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ తీసుకుని పేరుకుపోయిన చెత్తని తీయాలని కోరారు.
తెలంగాణ
సద్దుల చెరువు వద్ద పేరుకుపోయిన చెత్త


