KRNL: దేశ రక్షణలో విధులు నిర్వహిస్తూనే సెలవుల్లో తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడుగా నిలుస్తున్నాడు. దొడ్డి బెలగల్ గ్రామానికి చెందిన అగ్నివీర్ జవాన్ రామాంజనేయులు. పండుగలు, సెలవుల్లో వచ్చారు. తండ్రితో కలిసి పొలం పనుల్లో పాల్గొంటున్నారు. పొలంలో కాడుమాను మోసి, గుంటుక పాశారు. దేశ సేవతో పాటు రైతు బిడ్డగా శ్రమిస్తున్న రామాంజనేయులును పలువురు అభినందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దేశ రక్షణలో జవాన్.. పొలంలో రైతు బిడ్డగా!


