హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయాలి'

VZM: వాయుగుండం ప్రభావంతో వంగర మండలం అరసాడ వద్ద కొట్టుకుపోయిన రహదారిని, ముంపునకు గురైన పంట పొలాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు ఇవాళ ఉదయం పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాహనాల రాకపోకలకు తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయాలని సూచించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.