హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: యానాంలో చీరమేను సందడి

కోనసీమ: యానాం మార్కెట్‌కు ఈ సీజన్‌లో తొలి చీరమేను చేరడంతో మార్కెట్‌లో సందడి నెలకొంది. తూర్పుగాలుల ప్రభావంతో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు చీరమేను చిక్కింది. సుమారు 7 కిలోల బరువున్న చీరమేను బకెట్‌ రూ. 26 వేలకు వేలంలో విక్రయమైంది. కిలోకు సుమారు రూ.3,700 ధర పలకగా, సేరు ధర రూ.4 వేల వరకు చేరింది. దీపావళి వరకు చీరమేను లభించే అవకాశం ఉంది.