హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్రేయపురం ప్రత్యేక అధికారిగా సురేష్ కుమార్

కోనసీమ: ఆత్రేయపురం స్థానిక మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా కొత్తపేట డివిజనల్ అభివృద్ధి అధికారి కే సురేష్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. 6 నెలల కాలానికి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మండల పరిషత్ అధికారం పూర్తి కావడంతో ఈయన ఆధ్వర్యంలో పరిపాలన సాగనుంది.