హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అక్టోబర్ 1 లోపు మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోండి'

అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 1 ఆఖరు అని ఎక్సైజ్ శాఖ సీఐ టి.కె. తులసి ఒక ప్రకటన విడుదల చేశారు. ఖాళీగా ఉన్న ఎనిమిది మద్యం షాపులకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. రైల్వే కోడూరు లో 6, ఓబులవారిపల్లి లో 1, చిట్వేలి లో 1 బ్రాందీ షాపులు ఖాళీగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు.