హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నోటిఫికేషన్ రాకముందే.. ఎన్నికల ప్రచారం జోరు

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 5 వ కామాక్షి నగర్‌లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. పట్టణంలో ప్రతి వీధికి రోడ్డు డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు.