హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడల్లో ఘోర్పడేకు నిరాశ

ఆసియా క్రీడల టేబుల్‌ టెన్నిస్‌లో భారత క్రీడాకారిణి యశస్విని ఘోర్పడేకు నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ జపాన్‌ క్రీడాకారిణి మివా హరిమోటో చేతిలో 1-4తో ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. హరిమోటో కీలక గేమ్‌లలో ఆధిపత్యం ప్రదర్శించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.