హైదరాబాద్: 28°C
క్రీడలు

44 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం

భారత అథ్లెట్ సావన్ బర్వాల్ ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించాడు. పురుషుల మారథాన్‌లో రజత పతకం సాధించి, 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. 1982 తర్వాత ఈ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం. బర్వాల్ 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. జపాన్‌కు చెందిన యమషితా స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.