చెస్ ఒలింపియాడ్ 9వ రౌండ్‌లో భారత జట్లు సత్తాచాటి పతకాల రేస్‌లో నిలిచాయి. పురుషుల జట్టు 2.5-1.5తో జర్మనీపై విజయం సాధించింది. గుకేశ్ గెలవగా.. ప్రజ్ఞానంద, అర్జున్, నిహాల్ గేమ్‌లు డ్రాగా ముగిశాయి. మహిళల జట్టు 3-1తో ఉజ్బెకిస్థాన్‌పై నెగ్గింది. దివ్య, వంతిక అగర్వాల్ గెలిచారు. హంపి, సవిత డ్రా చేసుకున్నారు. మరో 2రౌండ్లు మిగిలి ఉన్నాయి.
క్రీడలు
చెస్ ఒలింపియాడ్‌లో భారత్ జోరు


