ప్రకాశం: సింగరాయకొండలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోల్డెన్ కేఫ్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి


