హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం

VZM: రాజాం పట్టణానికి తాగునీటి సరఫరా శనివారం ఉండదని కమిషనర్ రామచంద్రరావు, ఏఈ వెంకట రమణరాజు తెలిపారు. విద్యుత్ స్తంభాలు నేలకూలి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి పథకానికి ఇబ్బంది తలెత్తిందన్నారు. మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేసి ఆదివారం నుంచి యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, సహకరించాలని కోరారు.