హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం బ్యారేజీ 65 గేట్లు ఎత్తివేత

NTR: భారీ వర్షాలకు కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహంతో ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అధికారులు 65 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగునీటి అవసరాలకు పోను సముద్రంలోకి 47,125 క్యూసెక్కుల నీటిని వదిలారు. కృష్ణా డెల్టాలోని ప్రధాన కాలువలకు 7,804 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.