SKLM: సరుబుజ్జిలి మండలంలోని కొత్తకోట మినీ జలాశయం గట్టుపై సుమారు 15 అడుగుల పొడవు గల గిరినాగు హల్చల్ చేసింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు దానిని హతమార్చారు. వర్షాలు భారీగా కురవడంతో సమీప కొండల నుంచి దిగువకు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. భారీ సర్పాన్ని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. అటవీ శాఖ అధికారులు పరిశీలించి వివరాలు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మినీ జలాశయం గట్టుపై గిరినాగు హల్చల్


