హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి విక్రేత అరెస్ట్.. 14 రోజుల రిమాండ్

కృష్ణా: గంజాయి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ పరిధిలోని అనాస్‌పూర్‌కు చెందిన బొండారి శివ, గంజాయి కొనేందుకు వెళ్తూ దారిలో బైక్‌లు చోరీ చేసి ఒడిశాలో అమ్మేవాడు. ఆ డబ్బుతో గంజాయి కొని విక్రయించేవాడు. ఇప్పటివరకు ఉయ్యూరు పోలీసులు 12 మందిని అరెస్టు చేయగా, వారి సమాచారంతో శివను పట్టుకుని, 14 రోజుల రిమాండ్‌తో గన్నవరం కారాగారానికి తరలించారు.