WNP: జిల్లా కేంద్రంలోని రాజనగరం విశ్వక్సేన గోశాలలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి 26వ కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. భాద్రపద పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం 400 గోవుల మధ్య కళ్యాణ క్రతువు జరగనున్నట్లు గోశాల వ్యవస్థాపకులు సౌమిత్రి రామాచార్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
తెలంగాణ
నేడు వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం


