అన్నమయ్య: మదనపల్లెలోని జీఆర్‌టీ ఉన్నత పాఠశాలలో సాయిమాతా సేవా ట్రస్ట్, చెన్నై శంకర్ నేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు చిన్ని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరం జరుగుతుందని, కంటి సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 27న ఉచిత కంటి వైద్య శిబిరం


