MLG: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రేపు మెగా వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ బీబీనగర్ ఎయిమ్స్, ప్రతిమ మెడికల్ కళాశాలల నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు శిబిరానికి హాజరై సేవలు అందించనున్నట్లు చెప్పారు. ప్రజలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
రేపు చిన్నబోయినపల్లిలో మెగా వైద్య శిబిరం


