హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మిడ్ మానేరు జలాశయానికి కొనసాగుతున్న వరద

SRCL: బోయిన్‌పల్లి మండలం మాన్వాడ సమీపంలోని మిడ్ మానేరు జలాశయంలోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం ఉదయం 6 గంటల సమయానికి నీటిమట్టం 316.84 మీటర్లకు చేరగా, నిల్వ 24.614 టీఎంసీలుగా నమోదైంది. 14,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఏడు స్పిల్‌వే గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.