హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నేడు శిల్పారామంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌లోని శిల్పారామంలో శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. డిజిటల్ ఎజెండా, ఏఐ ఇతివృత్తంతో పర్యాటక దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పర్యాటక రంగంలో ఏఐ, డిజిటల్ సాంకేతికత వినియోగం, ఎకో, ఫిల్మ్, స్పోర్ట్స్, హెరిటేజ్ టూరిజంపై చర్చించనున్నారు.