హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిడ్నాప్, పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు: సీపీ

సిద్దిపేట వన్‌టౌన్ పరిధిలో బాలిక కిడ్నాప్, పోక్సో కేసులో నిందితుడు కొమ్ముగళ్ల బాలకృష్ణ (35)కు న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1.05 లక్షల జరిమానా విధించింది. 2018లో నమోదైన కేసులో అప్పటి ఇన్స్‌పెక్టర్ నందీశ్వర్‌రెడ్డి దర్యాప్తు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి వై. జయప్రసాద్ నిందితుడిని దోషిగా తేల్చారు.