హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనాధలుగా మారిన ముగ్గురు చిన్నారులు

ప్రకాశం: మర్రిపూడి మండలం పొన్నూరులో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన కరేటి కుమారి కూలీ పనికి వెళ్లి వరినారు తీస్తుండగా పాము కరిచి మృతి చెందింది. కాగా కుమారి భర్త గత మూడు సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధితో రోశయ్య మరణించాడు. వీరికి ముగ్గురు పిల్లలు. తల్లిదండ్రులు కోల్పోవడంతో ఈ ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఏమిటని గ్రామస్తులు బంధువులు రోదిస్తున్నారు.