హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆస్పత్రిలో చీకటి ఇక్కట్లు

KMR: పిట్లంలోని 30 పడకల నూతన సామాజిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిన సమయంలో ఇన్వర్టర్ లేక రోగులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని వారు తెలిపారు. దీనిపై సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ మాట్లాడుతూ..వసతుల కోసం ఆరోగ్య శాఖకు ప్రతిపాదనలు పంపామని, త్వరలో సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.