VSP: ఎండాడలోని జిల్లా పరిషత్ పాఠశాల మూడు రోజులుగా కురిసిన వర్షాలకు నీటితో నిండిపోయింది. పాఠశాల పరిసరాల్లో చెత్త పేరుకుపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. నేటి నుంచి విద్యార్థులు పాఠశాలకు హాజరుకానున్న నేపథ్యంలో నీటిలో జారిపడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు వెంటనే చెత్తను తొలగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఎండాడ జడ్పీ పాఠశాలలో అపరిశుభ్రత'


