హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భక్తిశ్రద్ధలతో లక్ష్మీనరసింహుని పవిత్రోత్సవాలు

ప్రకాశం: సింగరాయకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాల కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. స్వామివారికి అర్చకులు నిర్వహించిన విశేష పూజా కార్యక్రమాలలో ప్రజలు పాల్గొన్నారు. రక్షాబంధనం, తిరుమంజనం, అగ్ని ప్రతిష్ట, తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు.