హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేడు భారీ వర్షాలు!

భద్రాద్రి: తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాబోయే 24 గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో జిల్లాలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.