హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

W.G: భీమవరంలో శనివారం పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది. కొవ్వాడ సబ్ స్టేషన్ పరిధిలోని 33 కేవీ లైన్ మరమ్మతుల వల్ల ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు కరెంట్ ఉండదని ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. దుర్గాపురం, బైపాస్ రోడ్డు, ఆరేటి నగర్, లంక పేట, కొవ్వాడ పుంత, నరసింహపురం ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.