హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు-ట్రాక్టర్ ఢీ.. దంపతులకు తీవ్ర గాయాలు

HNK: ఐనవోలు మండలం పున్నెలు ఏకశిలా స్కూల్ ఎదుట వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.