హైదరాబాద్: 28°C
తెలంగాణ

రికార్డు ధర పలికిన లడ్డూ..!

VKB: జిల్లా కేంద్రంలోని 34వ వార్డు ఎమ్ఎమ్ఐజి ఫేస్-1లో ఏర్పాటు చేసిన లంబోదరుడి సన్నిధిలో లడ్డూ వేలంపాట నిర్వహించారు. అత్యధికంగా వేలం పాడిన వికారాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిఖిల్ రెడ్డి రూ.1.25 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా నిఖిల్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం గణనాథుడి ఊరేగింపు నిర్వహించారు.