ASF: జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో ఈనెల 27 వరకు సేవలు నిలిపివేస్తున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయంలో సర్వర్ కాలిపోవడంతో ఆన్‌లైన్ సేవల్లో సాంకేతిక అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. కేవలం లర్నింగ్ లైసెన్స్ సేవలు మాత్రమే పని చేస్తాయన్నారు. వాహనదారులు గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం.. సేవలు బంద్


