NLG: నల్గొండ నగరంలోని మర్రిగూడ ఎల్లమ్మ దేవాలయం వెనుక నివాసాల మధ్య నేలపైనే విద్యుత్ నియంత్రిక ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎత్తైన దిమ్మెపై ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా విద్యుత్ నియంత్రిక


