BDK: ఖమ్మం పట్టణానికి చెందిన కరాటే క్రీడాకారుడు కరాటే వేణు గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ప్రతిష్టాత్మక కరాటే కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగస్వామిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లాకు క్రీడా రంగంలో పేరు తెచ్చిన వేణును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం అభినందించారు. ఆయన విజయం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.
తెలంగాణ
ఖమ్మం వాసి గిన్నిస్ వరల్డ్ రికార్డు!


