హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్కీ డ్రాలో సీఎం రేవంత్‌రెడ్డి పేరు

SRPT: సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాసం మణి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద శుక్రవారం రాత్రి నిర్వహించిన లక్కీ డ్రాలో సీఎం రేవంత్‌రెడ్డి పేరు విజేతగా ఎంపికైంది. తోనుకునూరు సాయికుమార్ సీఎం పేరుతో చీటీ రాయగా, అదే విజేతగా నిలిచింది. కమిటీ ఆధ్వర్యంలో రూ.25 వేల నగదు, 15 కిలోల లడ్డూను బహుమతులుగా ఏర్పాటు చేశారు.