BHNG: ఆరోగ్య వ్యవస్థలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తారని డీఎంహెచ్‌వో డా. ఎం.మనోహర్ అన్నారు. ప్రపంచ ఫార్మసీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. మందుల నాణ్యత, నిల్వ, పంపిణీపై అవగాహన కల్పించాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఫార్మసిస్టులు శ్రీనివాస్, నిర్మల, సరిత, ఉమారాణిలను సన్మానించారు.
తెలంగాణ
ఆరోగ్య వ్యవస్థలో ఫార్మసిస్టులది కీలక పాత్ర


