MLG: వెంకటాపురం మండల కేంద్రంలోని కనకదుర్గ ఆలయం ఎదుట ఆర్‌అండ్‌బీ రహదారిపై భారీ గుంత వర్షపు నీటితో నిండి ప్రమాదకరంగా మారింది. పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురవుతుండటంతో స్థానికులు శుక్రవారం ప్లాస్టిక్ డబ్బాకు కర్ర కట్టి హెచ్చరిక సూచికగా ఏర్పాటు చేశారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా వర్షపు నీటి గుంత


