హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎనిమిది కిలోల గంజాయి స్వాధీనం.. కేసు నమోదు

MHBD: గూడూరు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో పోలీసులు 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. సీఐ వినయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, మహబూబాబాద్ జ్యోతిబసు కాలనీకి చెందిన వీరగాని కృష్ణ వద్ద సోదా చేయగా గంజాయి లభించింది. ఒడిశా నుంచి కొనుగోలు చేసి బీదర్‌లో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు.