హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

BHPL: మల్హర్ రావు మండలంలోని ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. షాట్‌పుట్‌లో గణేష్, హిమజ, లాంగ్‌జంప్‌లో సంకీర్తన, 100 మీటర్ల పరుగు విభాగంలో నిత్య ఎంపికైనట్లు ప్రిన్సిపల్ పూర్ణచందర్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్ర పోటీల్లో వారు పాల్గొననున్నారు.