హైదరాబాద్: 28°C
తెలంగాణ

గేదెను ఢీ కొన్న బైక్.. ఇద్దరికి తీవ్రగాయాలు

ASF: చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై అకస్మాత్తుగా వచ్చిన గేదెను బైక్ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరొకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.