హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మెగా జాబ్ మేళా

BHNG: చౌటుప్పల్ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27న‌ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఫౌండేషన్ చైర్మన్ బొల్ల శివశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తంగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాబ్ మేళా జరగనుంది.