హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.4 కోట్ల అద్దె బకాయిలు.. కుడా షాపింగ్ కాంప్లెక్సు సీజ్

HNK: హన్మకొండ కొత్త బస్టాండ్ కూడలిలోని కుడా షాపింగ్ కాంప్లెక్సును అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. లీజుదారుడు రెండేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో సుమారు రూ.4 కోట్ల బకాయిలు పేరుకుపోయినట్లు అధికారులు తెలిపారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు లీజు ఒప్పందంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.