HNK: హన్మకొండ ఆర్టీసీ బస్టాండు ప్రాంగణం గుంతలమయమై ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందిగా మారింది. వర్షం పడినప్పుడల్లా గుంతల్లో నీరు నిలిచి ప్రమాదకరంగా మారుతోంది. నామమాత్రంగా మట్టి పోసి వదిలేస్తుండటంతో సమస్య మళ్లీ మొదటికొస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. పలుమార్లు అధికారులు పరిశీలించినా శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తెలంగాణ
వర్షం వస్తే చాలు.. బస్టాండులో కష్టాలే!


