హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజశేఖర్‌కు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి

HNK: హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. శుక్రవారం ఇన్‌స్పెక్టర్ మహేందర్ ఆయనకు మూడు పట్టీలు తగిలించి శుభాకాంక్షలు తెలిపారు. విధుల్లో నిబద్ధతతో పనిచేసినందుకు పదోన్నతి లభించిందని అభినందించారు. కార్యక్రమంలో ఎస్సైలు దేవేందర్, శీలం రవి, పొన్నాల గోవర్ధన్ పాల్గొన్నారు.