హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు

KKD: యు.కొత్తపల్లి మండలం కోనపాపపేట, రమణక్కపేట, ఉప్పాడ ప్రాంతాల్లో అధికారుల బృందం శుక్రవారం పర్యటించింది. తహసీల్దార్ చిన్నారావు, ఎంపీడీవో లక్ష్మీరెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు రావు అక్షయ్ తదితరులు ఆయా గ్రామాల్లో పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాగులాపల్లి గ్రామంలో తాగునీటి సమస్యపై స్పందించిన అధికారులు ప్రధాన పైపులైన్‌ను తనిఖీ చేశారు.