హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చదువుతోనే ఉన్నత శిఖరాలు'

NLG: అంబేద్కర్ చెప్పినట్లు విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చని, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం ఆయన కొండమల్లేపల్లి మండలం, డింజలాల్ తండా బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో వంట గది, స్టోర్ రూమ్‌, పరిసరాలను తనిఖీ చేశారు.