హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇబ్రహీంపూర్ పెద్ద చెరువుకు జలకళ

JN: రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్ పెద్ద చెరువు భారీ వర్షాలతో పూర్తిస్థాయిలో నిండి మత్తడి పోస్తోంది. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్ చంద్రారెడ్డి, సర్పంచ్ పోకల శ్రీనివాస్ చెరువు వద్ద శుక్రవారం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని ఆకాంక్షించారు.